కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించిన నగర మేయర్

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయంలో నేడు నగర మేయర్ గుండు సుధారాణి కేంద్ర ప్రభుత్వ డబ్ల్యూఆర్ఐ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ ఫేజ్-2 లో వరంగల్ నగరానికి చోటు దక్కడంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ డబ్ల్యూఆర్ఐ ప్రతినిధుల ప్రజెంటేషన్‌ను వీక్షించి మేయర్ తగు సూచనలు చేశారు.