లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ నుంచి రామాయంపేటకు ధాన్యం లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన డ్రైనేజ్‌పైకి వెళ్లడంతో బోల్తా పడింది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా డ్రైనేజ్‌పై రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.