ప్రమాదంపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

ప్రమాదంపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

CTR: గంగవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‍లో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.