'చెట్లకు నష్ట పరిహారం చెల్లించాలి'

'చెట్లకు నష్ట పరిహారం చెల్లించాలి'

AKP: వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరించిన డీ ఫారం భూముల్లో చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని నక్కపల్లి మండలం డీఎల్ పురం మాజీ ఎంపీటీసీ గింజాల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. సోమవారం అమరావతిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. భూములు సేకరించే ముందు చెట్లకు నష్టపరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు.