'షాదీ ముబారక్ పథకం మహిళలకు అండగా నిలుస్తుంది'

HYD: షాదీ ముబారక్ పథకం మహిళలకు అండగా నిలుస్తుందని మలక్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. శనివారం సైదాబాద్ మండలం పరిధిలోని సుమారు 40 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.40 లక్షలకు పైగా షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బలాల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.