వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
బాపట్ల: వేసవిలో విద్యుదాఘాతంతో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చీరాల అగ్నిమాపక అధికారి రామకృష్ణ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఫ్రిజ్ల్‌లు వినియోగించే వేళ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఎండలో వాహనాలు నిలిపినా పెట్రోల్ ట్యాంకు వేడెక్కి, మంటలు చెలరేగే అవకాశం ఉందన్నారు.