అక్రమ నిర్మాణంపై పోలీసులకు ఫిర్యాదు
NZB: బోధన్ పట్టణంలో తమ స్థలంలో కొందరు అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారని డాక్టర్. మునవర్ సిరాజ్ ఆరోపించారు. పట్టణంలోని విష్ణు భవన్ సమీపంలో తమకు చెందిన భూమి ఉందని దాన్ని కొందరు ఆక్రమించుకొని భవనం నిర్మిస్తున్నారన్నారు. తండ్రి ద్వారా తమకు సంక్రమించిన స్థలంలో అక్రమ నిర్మాణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.