గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సంబరాలు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో ఐదు రౌండ్‌లు ముగిసే సరికి 12,651 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నాడు. దీంతో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బానసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం నివాసంలో లక్ష్మిదేవి పూజ ప్రారంభించారు. ఈ పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.