VIDEO: 'ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి'

VIDEO: 'ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి'

బాపట్ల: పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జి. రఘురాం రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.