నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ పరిధిలో జెడ్పీహెచ్ఎస్ భవనంలో క్లస్టర్-1, క్లస్టర్-2 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సంతోష్ గురువారం సందర్శించారు. అనంతరం ఎర్రవల్లి, సాసనోలు, ఆర్. గార్లపాడు, తిమ్మాపూర్, షేక్పల్లె, బీచుపల్లి, జింకలపల్లి, కొండేరు, బి.వీరాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ లిస్టులు పరిశీలించారు.