'శాంతి, ప్రేమ, సేవ సిద్ధాంతాలు ఆదర్శనీయం'
PPM: మానవ సేవే... మాధవ సేవ అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. ఆయన చెప్పిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవ సిద్ధాంతాలు విశ్వవ్యాప్తంగా ఆదర్శనీయమని కొనియాడారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని అన్నారు.