మరో 67 మంది తాలిబన్లను హతమార్చాం: పాక్
తమ భద్రతా దళాలు జరిపిన దాడుల్లో మరో 67 మంది తాలిబన్లు హతమైనట్లు పాక్ తెలిపింది. నైరుతి సరిహద్దు వెంబడి 16 ప్రాంతాల్లో తాలిబన్ల దాడులను తన బలాగాలు తిప్పికొట్టినట్లు చెప్పింది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ సరిహద్దు వెంబడి 40 మందిని, ఉత్తర బలోచిస్తాన్‌లో మరో 27 మందిని చంపినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 435 మంది తాలిబన్లు మరణించారని, 630 మంది గాయపడ్డారని పేర్కొంది.