VIDEO: 'పారదర్శకంగా పంట నష్టం వివరాలను పంపాలి'
AKP: మొంథా తుపాన్ కారణంగా కురిసిన వర్షాలకు తమలపాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ తోట నగేశ్ అన్నారు. పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలోని వర్షాలతో పడిపోయిన తమలపాకు పంటను శనివారం పరిశీలించారు. వ్యవసాయాధికారులు తక్షణమే పంట నష్టంను పారదర్శకంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పారు.