VIDEO: రాష్ట్రంలో వేల కేజీల గంజాయి సీజ్: ఐజీ

NLR: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఈగల్ ఆధ్వర్యంలో 23 వేల కేజీల గంజాయిని సీజ్ చేశామని ఐజీ రవికృష్ణ తెలిపారు. ఐజీ మాట్లాడుతూ.. స్మగ్లర్ ప్రకాశంను పట్టుకోవడంలో జిల్లా పోలీసులతో పాటు, ఈగల్ టీం కీలకంగా వ్యవహరించినట్లు ఇవాళ వెల్లడించారు. స్థానిక పోలీసుల సహకారంతో మరిన్ని దాడులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గంజాయి మూలాలను గుర్తించి అక్కడే నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామన్నారు.