రాముతండా తొలి సర్పంచ్‌గా మీటు నాయక్ ఏకగ్రీవం
MHBD: ఇనుగుర్తి మండలంలో నూతనంగా ఏర్పడిన రాము తండా గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి భూక్య మీటు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నిన్న ఇద్దరు అభ్యర్థులు విత్ డ్రా చేసుకోగా, మీటు నాయక్ ఒక్కరే బరిలో ఉండడంతో ఏకగ్రీవ సర్పంచ్‌తో పాటు 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.