గిద్దలూరులో వాహన తనిఖీలు
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వాహనదారులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో గిద్దలూరు PSI రమణబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.