'ఇంటి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబేట్'
MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ఇంటి యజమానులకు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఇంటి యజమానులు 2026-27 సంవత్సరానికి ఇంటి పన్నును పూర్తిగా చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ లభిస్తుందన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిపీట్ లభిస్తుందని ఆయన వివరించారు.