అదుపుతప్పిన RTC బస్సు

BHPL: జిల్లా దీక్షకుంట సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. పస్రా నుండి భూపాలపల్లి వైపు వస్తున్న బస్సు మిషన్ భగీరథ పైప్ లైన్ వద్ద బురద కారణంగా స్కిడ్ అయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును అదుపు చేశాడు. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదని డిపో మేనేజర్ తెలిపారు.