నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను అందజేసిన ఎల్ఐసీ సంస్థ

SRD: హత్నూర మండలం నవాబుపేట గ్రామస్తులకు ఎల్ఐసీ సంస్థ సహకారంతో రెండు లక్షల 30 వేలతో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు ఏజెంట్ యాదగిరి తెలిపారు. ముఖ్య అతిథిగా ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ ప్రేమ పాల్గొని మాట్లాడుతూ గ్రామస్తులు 46 ఎల్ఐసీ పాలసీలు తీసుకోవడం వల్ల గ్రామాన్ని బీమా గ్రామంగా ప్రకటిస్తూ నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను అందజేయడం జరిగిందన్నారు.