మార్చురీ ఘటన.. పలువురు సస్పెండ్
MBNR: జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీలోని మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఆ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.