గీసుగొండ జూనియర్ కాలేజీలో వసతులు కల్పించాలి: కలెక్టర్

WGL: గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె కళాశాలను సందర్శించి అక్కడున్న వసతులపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యను అందించాలని అక్కడున్న ప్రిన్సిపల్, అధ్యాపకులకు సూచించారు.