HPV వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించిన DIO

HPV వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించిన DIO

KMR: బాన్సువాడ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన HPV వ్యాక్సినేషన్ సెంటర్ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రోహిత్ శనివారం సందర్శించారు. ఇప్పటివరకు బాలికలకు అందించిన వ్యాక్సినేషన్ టీకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. బాలికల తల్లిదండ్రులకు, ప్రజలకు HPV వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై వివరించాలన్నారు.