నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి
NRPT: మరికల్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలోని రైల్వే అండర్ బ్రిడ్జి అధ్వాన్నంగా మారిందని, తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు ఇబ్రహీంపట్నం అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. సీసీ రోడ్డు నిర్మాణం, వర్షపు నీరు వెళ్లేందుకు కాలువ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మునిస్వామి, రఘు, సత్యనారాయణ, వెంకటస్వామి పాల్గొన్నారు.