ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన తహసీల్దార్

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన తహసీల్దార్

మన్యం జిల్లాలో వీరఘట్టం మండలంలో యూరియా కోసం వచ్చే రైతుల నుంచి అధిక ధరలకు విక్రయిస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు హెచ్చరించారు. ఏవో సౌజన్యతో కలిసి ఆయన వీరఘట్టంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను పరిశీలించి, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.