ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా కూటమి సర్కారు చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రాయనపాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.