VIDEO: 10 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు

SRPT: సూర్యాపేట జిల్లా నాగారంలో 10 కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సూర్యాపేటలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలను డీఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నం నుంచి 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నాగారం ఎక్స్ రోడ్డులో తిరుగుతున్న వారిని పట్టుకున్నట్టు తెలిపారు.