పంచారామ దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

పంచారామ దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

WGL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి నవంబర్ 8 సాయంత్రం 6 గంటలకు 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సు పంచారామ క్షేత్రాల దర్శనార్థం బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మీ ఇవాళ తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శివాలయాలను ఒకే రోజులో దర్శించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.