VIDEO: బీజేపీకి రాజీనామా చేసిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
KMR: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం బీజేపీకి రాజీనామ చేస్తున్నట్లు తెలిపారు. శనివారం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. బీజేపీలో ఉండి జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేక రాజీనామ చేస్తున్నట్లు వెల్లడించారు.