విడాకులు కాకుండా రెండో పెళ్లి.. ఏడుగురిపై కేసు

GNTR: తెనాలి మండలం కొలకలూరుకు చెందిన లింగంశెట్టి ఉమామహేశ్వరరావుపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2003లో తమకు వివాహం కాగా, భర్త 2012లో మరో మహిళను వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలను కన్నారని, వారికి ఆస్తిని కూడా రిజిస్టర్ చేశారని భార్య భూలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.