ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ABVP నాయకుల వినతి
ATP: విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఉరవకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు రావడం లేదన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సమయానికి బస్సులు నడపాలని కోరారు.