పండుగల సందర్భంగా పరిశుభ్రతపై ఎస్‌డీపీఐ వినతి

పండుగల సందర్భంగా పరిశుభ్రతపై ఎస్‌డీపీఐ వినతి

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా దేవాలయాలు, ఈద్గా పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఇవాళ ఎస్‌డిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌కు ఎస్‌డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు ఆరిఫ్ హుస్సేన్, సభ్యులు మాసూం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.