ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన మంత్రి
SRPT: హుజుర్‌నగర్‌లోని అందాల కేంద్రంలో నీ రామస్వామి గుట్ట 110 ఎకరాలలో 200కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల పనులను మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉన్నారు.