GREAT.. 117 సార్లు రక్తదానం..!
VKB: జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ సాయి చౌదరి 117వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ దీపక్ తివారి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. సాయి చౌదరి స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన పౌరులందరూ రక్తదానానికి ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారిని కాపాడాలన్నారు.