VIDEO: పల్టీ కొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: పల్టీ కొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

MHBD: బ్రేకులు ఫెయిల్ అయి కారు పల్టీ కొట్టిన ఘటన సిరోల్ మండలంలో శనివారం జరిగింది. MHBD నుంచి KMM వైపు వెళ్తున్న కారు సీరోల్ మండలం మన్నెగూడకు రాగానే బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు‌లో ఉన్నవారికి స్వల్పంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.