పల్లె ప్రకృతి వనంకు నిప్పు పెట్టిన దుండగులు

పల్లె ప్రకృతి వనంకు నిప్పు పెట్టిన దుండగులు

MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు సర్పంచ్ వినోద మహేందర్‌కు సమాచారం అందించారు. వనంలోని మొక్కలతో పాటు ఇతర సామాగ్రి, కాలి బూడిదయ్యాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.