పంచరామాలకు స్పెషల్ బస్సులు

పంచరామాలకు స్పెషల్ బస్సులు

ప్రకాశం: కార్తీక మాసంలో పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. నవంబర్ 2, 9, 16వ తేదీల్లో రాత్రి 8 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సులు బయలుదేరుతాయన్నారు. ఒక టికెట్ ధర రూ. 2000 మాత్రమే అని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.