'పెంచలయ్య భార్యను ఆదుకోవాలి'
NLR: గంజాయి స్మగ్లర్‌ల ముఠాకు బలైన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా వెంటనే ఆదుకోవాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. హత్యను తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.