ఇండిగో సంక్షోభం.. రీఫండ్ పూర్తి: కేంద్రం
ఇండిగో టికెట్ల రీఫండ్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.610 కోట్ల చెల్లింపులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రయాణికులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,000 లగేజీలను డెలివరీ చేసినట్లు తెలిపింది. సంక్షోభం నుంచి బయటపడటం, సర్వీసుల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకునేందుకు సీఈవో, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది.