గండి అంజన్నకి ఒక్కరోజులోనే భారీ ఆదాయం

గండి అంజన్నకి ఒక్కరోజులోనే భారీ ఆదాయం

KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో శనివారం వీరాంజనేయస్వామి దేవస్థానంలో వివిధ స్వామివారి సేవా టిక్కెట్ల ద్వారా రూ.12,98,335లు ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు.సేవా టిక్కెట్లు, లడ్లు, పులిహోరా ప్రసాదాలు, అన్నదాన విరాళాలు, తాత్కాలిక హుండీలు, అంగళ్ల ద్వారా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 6,000మందికి అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.