కాంగ్రెస్‌కు మద్దతుగా జేఏసీ నాయకుల ప్రచారం

HYD: న్యూ బోయిగూడలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా మాల ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ జీ.చెన్నయ్య ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు, రాజ్యాంగ రక్షణకోసం మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీధర్ రావు, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.