బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

HNK: హైదరాబాద్‌లో నుంచి తప్పిపోయిన 10 ఏళ్ల సాయి ప్రియ ఇవాళ హనుమకొండ బస్టాండ్‌కు చేరడంతో పోలీసులు ఆమెను గుర్తించి రక్షించారు. వివరాలు తెలుసుకుని, ఆమె గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందినదని నిర్ధారించిన పోలీసులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు అప్పగించారు. వేగంగా స్పందించిన హన్మకొండ పోలీసులను స్థానికులు అభినందించారు.