నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ

NZB: జిల్లా సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో శుక్రవారం నూతన ఆహార భద్రత కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జీల మల్లేష్, సీనియర్ నాయకులు కెసి రెడ్డి శ్రీను, ఇందిరమ్మ కమిటీ గంగారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేయలేని రేషన్ కార్డుల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.