రహమత్ నగర్ డివిజన్‌లో బీఆర్ఎస్ ప్రచారం

రహమత్ నగర్ డివిజన్‌లో బీఆర్ఎస్ ప్రచారం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు డివిజన్లలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ మంగళవారం రహమత్ నగర్ డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించారు.