నిరుద్యోగులకు గుడ్ న్యూస్

BHPL: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు 18 నుంచి 28 సంవత్సరాలలోపు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.