'మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి'
VZM: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బాడంగి మండలం వాడాడలో కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను పీపీపీ పద్దతిలో ప్రైవేట్ చేసి పేదలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు.