VIDEO: పులివెందులలో స్టార్టప్ విలేజ్ సెంటర్ ప్రారంభం
KDP: పులివెందుల మినీ సెక్రటేరియట్లో డీఆర్డీఏ పీడీ రాజ్య లక్ష్మి శనివారం స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రైన్యూర్ సెంటర్‌ను ప్రారంభించారు. మహిళా ఉత్పత్తుల నాణ్యత పెంపు, మార్కెటింగ్, సేవా రంగాల్లో మెరుగైన ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, సీఆర్పీలు పాల్గొన్నారు.