టెడ్ ఎక్స్‌లో ప్రసంగించి చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే
GNTR: గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాద్‌లో సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ప్రతిష్టాత్మక టెడ్‌ఎక్స్ కార్యక్రమంలో ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ వేదికపై మాట్లాడిన తొలి రాజకీయ నాయకురాలిగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.