బేబీ పాండ్‌ను పరిశీలించిన కార్పొరేటర్

RR: బీఎన్ రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్‌లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్‌ను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేబీ పాండ్ మూడు అడుగులలోపు ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు వినియోగించుకోవాలన్నారు.