దారుణం.. 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

దారుణం.. 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు నిందితులు కలిసి సామూహికంగా అత్యాచారం చేశారు. వరుసగా రెండు రోజుల పాటు బాధితురాలిని గోదాంకు తీసుకుని వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మైనర్లుగా గుర్తించారు.