టీడీపీ కుటుంబాలకు రూ.10లక్షలు అందజేత
ATP: రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ సంక్షేమ విభాగం ద్వారా రూ.10 లక్షల బీమా మంజూరైంది. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్వయంగా ఈ చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. పోరాళ్ల లక్ష్మన్న భార్య లక్ష్మీనారాయణమ్మకు రూ.5 లక్షలు, నవీన్ కుమార్ భార్య లావణ్యకు రూ.5 లక్షలు అందజేశారు.